
కరాచీ:ఇప్పటికే శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ను కోల్పోయి రెండో టెస్టులో కూడా ఎదురీదుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ నుంచి పాకిస్తాన్ ప్రధాన పేసర్ మొహ్మద్ ఆమిర్ దూరమయ్యాడు. కుడికాలి పిక్క గాయంతో బాధపడుతున్న ఆమిర్ కు లంకేయులతో జరిగే ఐదు వన్డేల సిరీస్ నుంచి విశ్రాంతినిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండో టెస్టుకు దూరమైన ఆమిర్.. ఇక వన్డే సిరీస్ నుంచి కూడా తప్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా, అతని స్థానంలో ఇంకా ఎవర్నీ ఎంపిక చేయలేదు.
తొలి టెస్టులో పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 136 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరొకవైపు రెండో టెస్టులో కూడా పాక్ పై లంక ఆధిక్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 482 పరుగులు చేయగా, పాకిస్తాన్ 262 పరుగులు చేసి రెండొందలకు పైగా పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment