'ఆమిర్పై సానుభూతి ఉంటుంది' | Imran Khan expects sympathy for Mohammad Amir in England | Sakshi
Sakshi News home page

'ఆమిర్పై సానుభూతి ఉంటుంది'

Published Mon, Jun 20 2016 3:41 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

'ఆమిర్పై సానుభూతి ఉంటుంది'

'ఆమిర్పై సానుభూతి ఉంటుంది'

కరాచీ: మ్యాచ్ ఫిక్సింగ్ అనంతరం దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఇంగ్లండ్తో పర్యటనకు సిద్ధమయ్యే  పాకిస్తాన్ ప్రధాన పేసర్ మొహ్మద్ ఆమిర్కు అక్కడ ఎటువంటి ప్రతికూల వాతావారణ ఎదురవ్వదని దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఆనాడు ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా ఆమిర్ ఫిక్సింగ్కు పాల్పడినా, ఆ ప్రభావం అతనిపై ఎంతమాత్రం ఉండదన్నాడు.

 

'ఆమిర్కు ఇంగ్లండ్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేదు. ఆనాటి ఘటనపై ఆమిర్ను అక్కడి వారు చిన్నచూపు చూసే అవకాశమే లేదు. నా అనుభవం మేరకు ఆమిర్ పై అమితమైన సానుభూతి ఉంటుంది. ఇది రాబోవు సిరీస్ల్లో ఆమిర్ మెరుగ్గా రాణించడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది.  సుమారు 18-19 సంవత్సరాల వయసులోనే ఆమిర్ ఫిక్సింగ్ చేసినా, ఆ తప్పును ఒప్పుకున్నాడు. అందరికీ క్షమాపణలు చెప్పాడు. అందుకు ప్రతిఫలం కూడా అనుభవించాడు'అని  1992 వరల్డ్ కప్ గెలిచిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement