
కరాచీ: గత కొన్ని నెలలుగా బౌలింగ్‌లో విఫలమవుతున్న పాకిస్తాన్ లెఫ్మార్మ్ పేసర్ మహ్మద్ అమిర్‌కు మరోసారి ఉద్వాసన తప్పలేదు. యూఏఈ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20 సిరీస్‌లో అమిర్‌కు చోటు దక్కలేదు. స్పాట్ ఫిక్సింగ్ నిషేధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ జట్టులో పునరాగమనం చేసి కీలక బౌలర్‌గా మారిపోయిన అమిర్.. కొంత కాలంగా ఆశించిన మేర రాణించడం లేదు. దాంతో ఇటీవల ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్ కూడా అమిర్‌ను ఎంపిక చేయలేదు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు చోటు దక్కుతుందని భావించిన అమిర్‌ను ఈసాకి కూడా పాక్ సెలక్టర్లు పట్టించుకోలేదు. ఆసీస్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్టునే కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఆ క్రమంలోనే అమిర్‌పై వేటు తప్పలేదు.
కాగా, గత నెలలో న్యూజిలాండ్ ‘ఎ’తో సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ‘ఎ’ తరపున ఆడిన వకాస్ మజ్జూద్‌ను మరోసారి ఎంపిక చేశారు. ఆసీస్‌తో సిరీస్‌కు మజ్జూద్‌ను ఎంపిక చేసినప్పటికీ అతనికి ఆడే అవకాశం లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment