
నిషేధం అనంతరం మళ్లీ జట్టులోకొచ్చిన పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ ఆమీర్ పునరాగమనం సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్లలో ఆమీర్ ఒకడని ప్రశంసించడంపై ఆ పాక్ బౌలర్ స్పందించాడు. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ ఒకడని కితాబిచ్చాడు. ఛేజింగ్‌లో అతడు మరింత ప్రమాదకారి అని, అందుకే కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు కట్టుదిట్టంగా బంతులు సంధిస్తానని తెలిపాడు.
‘ప్రస్తుత క్రికెట్‌లో కోహ్లీ ఓ అద్భుత ఆటగాడు. ఒక్కసారి ఫామ్‌లోకొచ్చాడంటే అతడిని ఔట్ చేయడం అంత తేలిక కాదు. అందుకే కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే బౌలర్లు క్రమశిక్షణతో లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేస్తారు. కోహ్లీ క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను అవలీలగా లాగేసుకుంటాడు. ప్రపంచ అత్యుత్తుమ బౌలర్లకే కోహ్లీ ఓ బిగ్ ఛాలెంజ్‌గా కనిపిస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా కోహ్లీని పెవిలియన్ పంపాలని ఓ బౌలర్‌గా ఆలోచిస్తానంటూ’ కోహ్లీ గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.
2010లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆమీర్ ఐదేళ్ల నిషేధం అనంతరం మళ్లీ పాక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన ట్వంటీ వరల్డ్ కప్పు ప్రారంభానికి ముందు ఆమీర్ కోరిక మేరకు అతడికి తాను సంతకం చేసిన ఓ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు కోహ్లీ. తాను ఎదుర్కొన్న బౌలర్లలో పాక్ బౌలర్ చాలా టఫ్ అని, అతడి బౌలింగ్‌లో ఆడటం కాస్త ఇబ్బందిగా ఉంటుందని కోహ్లీ ప్రశంసల జల్లులు కురిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment