ఇస్లామాబాద్ : చాంపియన్స్ ట్రోఫీ-2017 టోర్నీలో ఆసాంతం ఆకట్టుకున్న టీమిండియా ఫైనల్లో దాయదీ పాకిస్తాన్ చేతి ఖంగుతిన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చి పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ భారత పతానాన్ని శాసించాడు. తాజాగా వాయిస్ ఆఫ్ క్రికెట్ షోలో ఈ పేస్ బౌలర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీయడం వెనుకున్న తన వ్యూహం ఎంటో తెలియజేశాడు.
‘రోహిత్ శర్మను ఔట్ చేయడానికి ఉపయోగించిన ఇన్ స్వింగ్ బంతినే కోహ్లికి ప్రయోగించా. కానీ అతను నా వ్యూహాన్ని పసిగట్టి చక్కగా ఆడాడు. అనంతరం కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మా ఫీల్డర్ చేజార్చాడు. దీంతో ఈ అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకోని చెలరేగుతాడని భావించాను. కానీ ఎలాగైన అతని వికెట్ పడగొట్టాలని దేవున్ని ప్రార్థించాను. మరుసటి బంతికే షాదాబ్‌ఖాన్ అద్భుత క్యాచ్‌తో కోహ్లి వికెట్ దక్కింది.’ అని నాటి రోజును ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూలర్క్, కోహ్లిలలో తనకు ప్రత్యేకమైన వికెట్ ఏది అన్న ప్రశ్నకు సచిన్‌దేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్. కానీ సచిన్ వికెటే నాకు ప్రత్యేకం. ఎందుకంటే సచిన్‌కు ప్రత్యర్థిగా నేను ఆడితే. అప్పుడు నేను జట్టుకు కొత్త. కాబట్టి నాకు సచిన్ వికెట్ ప్రత్యేకం అవుతోంది.’ అని తెలిపాడు.
ఈ ఫైనల్లో ఆమిర్ భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పెవిలియన్ చేర్చి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్‌లోనే తన ఇన్‌స్వింగ్ బంతితో వికెట్లు ముందు రోహిత్‌ను బోల్తాకొట్టించాడు. హర్దిక్ పాండ్యా(76) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమవడంతో భారత్ 180 పరుగుల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment