
కరాచీ:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అమిర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మన్ కోహ్లి అనడంలో ఎటువంటి సందేహం లేదని, అతని వికెట్ తీయాలంటే శక్తిమేర బౌలింగ్ చేయక తప్పదని కొనియాడాడు. 'విరాట్ అత్యుత్తమ ఆటగాడని ప్రపంచం మొత్తానికి తెలుసు. అతనికి బౌలింగ్ చేసేటప్పుడు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని చేయాలి. ఒకవేళ కోహ్లికి కనుక ఛాన్స్ ఇచ్చారా.. అంతే సంగతులు. మ్యాచ్ ను మొత్తం తమవైపు తిప్పేసుకుంటాడు. కోహ్లికి అత్యుత్తమ స్ట్రైక్ రేట్ ఉంది. లక్ష్య ఛేదనలోని కోహ్లికి అతనే సాటి. అందుకే అతనిపై ప్రత్యేక దృష్టి పెడతా'అని అమిర్ పేర్కొన్నాడు.
ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన కోహ్లి.. అమిర్ బౌలింగ్ ను ప్రత్యేకంగా కొనియాడాడు. 'పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అమిర్ బాగా రాణిస్తున్నాడు. నా కెరీర్ లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో అతనొకడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో అమిర్ టాప్-3లో కచ్చితంగా ఉంటాడు. అమిర్ బౌలింగ్ ను ఆడాలంటే 'ఎ' క్లాస్ ఆటను ఆడాలి. ఒక అసాధారణ బౌలర్ అమిర్'అని కోహ్లి ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment