పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ బౌలర్లలో మహ్మద్ అమీర్ ఒక్కడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా 2020 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనూహ్యంగా అమీర్ తప్పుకున్నాడు. అయితే పీసీబీ చైర్మెన్ రమీజ్ రజా తప్పకోవడంతో అమీర్ మళ్లీ పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలు వినిపించాయి.
కానీ అమీర్ పాకిస్తాన్‌కు కాకుండా ఐపీఎల్‌లో ఆడేందుకు అస్త్రాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2008 ఐపీఎల్ సీజన్ తర్వాత ఏ ఒక్క పాక్ ఆటగాడు కూడా క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడటంలేదు. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తల కారణంగా పాక్ ప్లేయర్లపై ఐపీఎల్‌లో నిషేధం విధించారు. అయితే అమీర్ మరి ఎలా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడని మీకు సందేహం కలగవచ్చు.
యూకే పౌరసత్వం పొందనున్న అమీర్
అమీర్ 2016లో బ్రిటిష్ యువతి, లాయర్ నర్జీస్ ఖాన్‌ని వివాహం చేసుకున్నాడు. అమీర్ ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంగ్లండ్‌లోనే ఉంటున్నాడు. అతడు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పూర్తిగా పాకిస్తాన్ నుంచి ఇంగ్లండ్‌కు మకాం మార్చాడు. ఈ క్రమంలో 2024లో బ్రిటీష్ పాస్‌పోర్ట్‌తో పాటు, యూకే పౌరసత్వం పొందనున్నట్లు సమాచారం.
తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ తన ఐపీఎల్ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చాడు. "నేను ముందుగా ఇంగ్లండ్‌కు ఆడాలనుకోవడంలేదు. ఎందుకంటే ఇప్పటికే నేను పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ స్ధాయిలో ప్రాతినిధ్యం వహించాను. ఐపీఎల్ గురించి ఇంకా ఆలోచించలేదు. నేను బ్రిటన్ నుంచి నా పాస్‌పోర్ట్ పొందడానికి ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికైతే ఒక్కో అడుగు వేయాలని అనుకుంటున్నా" అని అమీర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్
Comments
Please login to add a commentAdd a comment