కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్ ఆగస్టు 16 నుంచి ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం(ఆగస్టు17) ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌పై జమైకా తల్లావాస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తల్లావాస్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. జమైకా బ్యాట్లరలో కెప్టెన్ బ్రాండన్ కింగ్(81) పరుగులతో అదరగొట్టాడు. సెయింట్ లూసియా బౌలర్లలో ఛేజ్ మూడు వికెట్లతో మెరిశాడు.
అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగల్గింది. సెయింట్ లూసియా బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(53), రోషన్ ప్రైమస్(37) పరుగులతో రాణించారు. జమైకా బౌలర్లలో ఇమాడ్ వసీం మూడు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, సల్మాన్ ఇర్షద్ తలా రెండు వికెట్లు సాధించారు.
అమీర్‌కు ఫ్యూజ్‌లు ఔట్..
ఈ మ్యాచ్‌లో జమైకా తల్లావాస్ బౌలర్, పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ పడగొట్టకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా సెయింట్ లూసియా బ్యాటర్ షన్ ప్రైమస్.. అమీర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. తన బౌలింగ్‌లో ప్రైమస్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు అమీర్ ఆశ్చర్యపోయాడు.
సెయింట్ లూసియా ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అమీర్ బౌలింగ్‌లో తొలి బంతికే ప్రైమస్ 96 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. అది చూసిన అమీర్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND vs WI: ఐర్లాండ్‌తో తొలి టీ20.. సంజూ శాంసన్‌పై వేటు! సిక్సర్ల కింగ్ ఎంట్రీ
Primus SMASHES Mohammed Amir with a 96 meter six for our @republicbanktt play of the day! #CPL23 #SLKvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/nPhn1RBI6Q
— CPL T20 (@CPL) August 17, 2023
Comments
Please login to add a commentAdd a comment