శతక్కొట్టిన వార్నర్.. పాక్‌ లక్ష్యం 308 | World Cup 2019 Australia Set 308 Runs Target For Pakistan | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన వార్నర్.. పాక్‌ లక్ష్యం 308

Published Wed, Jun 12 2019 6:45 PM | Last Updated on Wed, Jun 12 2019 6:57 PM

World Cup 2019 Australia Set 308 Runs Target For Pakistan - Sakshi

టాంటన్‌: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచకప్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తునే ఉన్నాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అర్దసెంచరీతో రాణించిన వార్నర్‌ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీంతో బుధవారం స్థానిక మైదానంలో జరగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు 308 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ నిర్దేశించింది. ఆసీస్‌ ఆటగాళ్లలో వార్నర్‌(107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్‌) శతకం సాధించగా.. ఫించ్‌(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. పాక్‌ బౌలర్లలో అమిర్‌(5/30), షాహిన్‌ ఆఫ్రిది(2/70)లు రాణించారు.
అమిర్‌ ఆగయా..
ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ అమిర్ అడ్డుకున్నాడు ‌. ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్‌ జోడిని ఔట్‌ చేసి తన వికెట్ల వేటను ప్రారంభించాడు. అనంతరం షాన్‌ మార్స్(23)‌, ఉస్మాన్‌ ఖవాజా(18), అలెక్స్‌ కేరీ(20)లను ఔట్‌ చేసి మిడిలార్డర్‌ను కూలగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుస విరామంలో వికెట్లు తీస్తూ డిఫెండింగ్‌ చాంపియన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో పరుగుల విషయం పక్కకు పెట్టి వికెట్లను కాపాడుకోవడానికే ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ నానా తంటాలు పడ్డారు. వార్నర్‌, ఫించ్‌లు రాణించడంతో ఫస్ట్‌ హాఫ్‌లో ఆసీస్‌దే పై చేయి. కానీ అమిర్‌ ఎంట్రీ అయ్యాక సెకండ్‌ హాఫ్‌లో ఆసీస్‌ చతికలపడింది. 

ఓపెనర్లు మినహా..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. తొలుత ఇద్దరు ఓపెనర్లు ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్న అనంతరం గేర్‌ మార్చి పరుగుల వరద పారించారు. ముఖ్యంగా సారథి ఫించ్‌ పాక్‌ బౌలర్లపై విరుచుకపడ్డాడు. అయితే తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించిన అనంతర పించ్‌ను అమిర్‌ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా వార్నర్‌ తనదైన రీతిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే శతకం పూర్తి చేసిన వార్నర్‌ను ఆఫ్రిది ఔట్‌ చేస్తాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మన్‌ ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 350 పరుగులకి పైగా స్కోర్‌ సాధిస్తుందనుకున్న ఆసీస్‌ చివరికి 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.



చదవండి: 
పాక్‌తో మ్యాచ్‌: ఆసీస్‌ ఓపెనర్ల అరుదైన ఘనత
కోహ్లిని తప్పుబట్టిన మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement