టాంటన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు రాణించడంతో ఆసీస్‌కు మంచి శుభారంభం లభించింది. ప్రపంచకప్‌లో భాగంగా నేడు స్థానిక మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన డిఫెండింగ్ చాంపియన్ జట్టుకు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 146 పరుగుల భాగస్వామం నమోదు చేశారు. అనంతరం ఫించ్(82)ను అమిర్ పెవిలియన్‌కు పంపించడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
అయితే తొలుత నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ జోడి ఆ తర్వాత గేర్ మార్చి దూకుడుగా ఆడారు. ముఖ్యంగా సారథి ఆరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుండటంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టుపై ఓపెనర్లు వందకు పైగా పరుగల భాగస్వామ్యం నమోదు చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిది కావడం విశేషం. అంతకుముందు 1996 ప్రపంచకప్‌లో పాక్‌పై ఇంగ్లండ్ ఓపెనర్లు స్మిత్, మికీ అథెర్టన్‌లు తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మళ్లీ ఐదు ప్రపంచకప్‌ల తర్వాత తొలి వికెట్‌కు శతక భాగస్మామ్యం చేసిన జోడిగా వార్నర్-ఫించ్‌లు నిలిచారు.
అంతేకాకుండా ప్రపంచకప్‌లో పాక్‌పై వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆసీస్ ఓపెనర్లుగా ఫించ్, వార్నర్‌లు మరో ఘనతను అందుకున్నారు. మార్క్ టేలర్, మార్క్ వా, గిల్‌క్రిస్ట్, హెడెన్ వంటి దిగ్గజ ఓపెనర్లతో సాధ్యంకాని రికార్డును తాజా ఓపెనర్లు అందుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment