ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మార్చి లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి కీలక బౌలర్లు సహా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ లేకుండా బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.
ఇక పేస్ విభాగంలో సీన్ అబాట్, జేసన్, నాథన్ ఎలిస్ చోటు దక్కించుకోగా... ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌తో పాటు మాథ్యూవేడ్ జట్టులోకి వచ్చారు. కాగా మార్చి 29 నుంచి రావల్పిండి స్టేడియంలో మ్యాచ్‌లు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.
పాకిస్తాన్ పర్యటనకు ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్టు ఇదే:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగర్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మాట్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.
ఆసీస్ పాక్ పర్యటన- షెడ్యూల్ ఇలా:
మొదటి టెస్టు- మార్చి 4-8: రావల్పిండి
రెండో టెస్టు- మార్చి 12- 16: కరాచి
మూడో టెస్టు- మార్చి 21-25: లాహోర్
మొదటి వన్డే- మార్చి 29
రెండో వన్డే- మార్చి 31
మూడో వన్డే- ఏప్రిల్ 2
ఏకైక టీ20- ఏప్రిల్ 5
చదవండి: Yuvraj Singh-Virat Kohli: నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం: యువీ భావోద్వేగ లేఖ
IPL 2022: రూ. 6.5 కోట్లే దండగ.. మళ్లీ వైస్ కెప్టెన్సీనా!? ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ గరం
Comments
Please login to add a commentAdd a comment