Abu Dhabi T10 League 2021: Mohammad Amir infected with Covid-19 - Sakshi
Sakshi News home page

Abu Dhabi T10 League: మాజీ పేసర్‌కు కరోనా.. లీగ్‌ నుంచి ఔట్‌

Published Thu, Nov 18 2021 2:03 PM | Last Updated on Thu, Nov 18 2021 2:21 PM

Mohammad Amir infected with Covid-19 pulls out of Abu Dhabi T10 League - Sakshi

Abu Dhabi T10 League 2021: Mohammad Amir infected with Covid-19: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ అమీర్‌ కరోనా బారిన పడ్డాడు. అమీర్‌ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌ శుక్రవారం( నవంబర్‌19) నుంచి ప్రారంభంకానుంది. అయితే కరోనా బారిన పడడంతో ఈ టోర్నమెంట్‌లో తను పాల్గొనడం లేదని అమీర్ ట్విట్టర్‌ వేదికగా  వెల్లడించాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, తను త్వరగా కోలుకోవడానికి అభిమానుల ఆశీస్సులు అవసరమని అతడు తెలిపాడు.

" నేను ఈ ఏడాది అబుదాబి టీ10  లీగ్ ఆడటం లేదు. ఎందుకంటే నాకు  కోవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణైంది. కానీ ఇప్పుడు నేను బాగున్నాను. త్వరగా కోలుకోవడానికి మీ అందరి ప్రార్థనలు కావాలి" అని మహమ్మద్ అమీర్ ట్వీట్ చేశాడు. కాగా ఈ టోర్నమెంట్‌లో క్రిస్ గేల్, ఫాఫ్ డు ప్లెసిస్,రస్సెల్‌ వంటి విధ్వంసకర ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement