ఆమె నా కెప్టెన్‌ : కోహ్లి | Virat Kohli Reveals His Off The Field Captain | Sakshi
Sakshi News home page

Published Mon, May 21 2018 4:33 PM | Last Updated on Mon, May 21 2018 5:34 PM

Virat Kohli Reveals His Off The Field Captain - Sakshi

విరాట్‌ కోహ్లి

న్యూఢిల్లీ : టీమిండియాకు సారథ్యం వహించే విరాట్ కోహ్లి మైదానం బయట తన కెప్టెన్‌ మాత్రం తన ప్రేయసి, సతీమణి అనుష్కా శర్మనే అని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో కోహ్లి నోట వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఆఫ్‌ ది ఫీల్డ్‌లో మీ కెప్టెన్‌ ఎవరని అడిగిన ప్రశ్నకు కోహ్లి నవ్వుతూ..  ‘ఇంకెవరు అనుష్క శర్మనే’ అని బుదులిచ్చాడు. అంతేగాకుండా తన జీవితంలో నిర్ణయాలు తీసుకునే అన్ని హక్కులు అనుష్కాకే ఉన్నాయన్నాడు. ఆమె తన బలం, సర్వస్వమని అభిప్రాయపడ్డాడు. జీవితభాగస్వామిగా ఎలా ఉండాలనుకుంటారో అలాంటి వ్యక్తే తనకు భాగస్వామిగా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. అనుష్కాకు క్రికెట్‌ అంటే పిచ్చి అని, ఆటను అర్థం చేసుకోవడమే కాకుండా ఆటగాళ్ల సెంటిమెంట్స్‌ను కూడా అర్థం చేసుకోగలదన్నాడు. ఇది ఆమెలో ఉన్న గొప్ప విషమని చెప్పుకొచ్చాడు.

నాలుగేళ్ల ప్రేయాయణం అనంతరం ఈ జంట గతేడాది డిసెంబర్‌లో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో అనుష్క విరాట్‌ జట్టైన బెంగళూరు మ్యాచ్‌లకు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలోని కోహ్లి వ్యాఖ్యలకు వీడియోను జోడిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement