ఎమ్మెల్యే పేరిట కోహ్లి దేశభక్తి సిక్సర్‌ | Bollywood Celebrities savage reply to BJP MLA Defends Kohli | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 22 2017 4:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Bollywood Celebrities savage reply to BJP MLA Defends Kohli - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో వివాహం చేసుకున్న టీమిండియా విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎమ్మెల్యేకి కౌంటర్‌ ఇస్తున్నారు.

కోహ్లి, అనుష్కలకు దేశభక్తి లేదని, అందుకే ఇండియాలో కాకుండా ఇటలీలో వివాహం చేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సూజిత్‌ సర్కార్‌(పింక్‌ ఫేమ్‌ ) తన ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘దేశభక్తి లేని విరాట్‌ తన  తొలి సిక్సర్‌ను దేశభక్తి ఉన్న ఎమ్మెల్యే  పేరు మీదే కొడతాడు’’ అంటూ సెటైర్‌తో ఓ ట్వీట్‌ చేశాడు. 

ఇక కమెడియన్‌ వీర్‌దాస్‌ అయితే పన్నాలాల్‌ను పర్యవసనాలు ఆలోచించని ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశాడు. అంతటితో ఆగకుండా తన ట్విట్టర్‌లో ‘‘ఇక నుంచి కొత్త రూలు .  ఏ  ఎమ్మెల్యే అయినా సరే ఆలోచించకుండా, పిచ్చిగా మాట్లాడితే న్యూస్‌ చానెల్స్‌ వాటిని ప్రచారం చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు’’  అంటూ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement