
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య ఆర్తి సోమవారం (జూలై 12న) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శివకార్తికేయన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. "18 ఏళ్ల తర్వాత ఈ రోజు మా నాన్న నా చేయి పట్టుకున్నాడు, అది కూడా నా కొడుకు రూపంలో. ఎన్నో ఏళ్ల నుంచి మోస్తూ వస్తున్న బాధను నా భార్య నేడు పోగొట్టింది. ఆమెకు కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు" అని ట్వీట్ చేశాడు. దీనికి తండ్రి ఫొటో ముందు తన చేయిని అప్పుడే పుట్టిన బాబు పట్టుకుని ఉండగా క్లిక్‌మనిపించిన ఫొటోను జత చేశాడు. ఇది చూసిన అభిమానులు కుట్టి శివకార్తికేయన్ వచ్చేశాడోచ్ అంటూ #KUTTYSK అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
శివకార్తికేయన్, ఆర్తి దంపతులకు 2013లో ఆరాధన అనే కూతురు జన్మించింది. పాప పుట్టిన ఎనిమిదేళ్ల తర్వాత కొడుకు జన్మించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే శివకార్తికేయన్ ప్రస్తుతం 'డాన్' సినిమా చేస్తున్నాడు. అతడు హీరోగా నటించిన 'డాక్టర్' సినిమా త్వరలోనే థియేటర్‌లో లేదా ఓటీటీలో రిలీజ్ కానుంది.
18 வருடங்களுக்குப் பிறகு இன்று என் அப்பா என் விரல் பிடித்திருக்கிறார் என் மகனாக…என் பல வருட வலி போக்க தன் உயிர்வலி தாங்கிய என் மனைவி ஆர்த்திக்கு கண்ணீர்த்துளிகளால் நன்றி🙏 அம்மாவும் குழந்தையும் நலம்🙏👍❤️😊 pic.twitter.com/oETC9bh6dQ
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 12, 2021
Comments
Please login to add a commentAdd a comment