‘బాహుబలి’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి కరోనావల్ల లాక్‌డౌన్ అయ్యింది. దాంతో అప్పుడు జరగాల్సిన వేడుకను వాయిదా వేశారు. సోమవారం బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించారు యష్. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలో బాబుకి య«థర్వ యష్ అని పేరు పెట్టారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు ‘జూనియర్ రాఖీ భాయ్‌కి శుభాకాంక్షలు’ అని కామెంట్స్‌పెట్టారు. ‘కేజీఎఫ్’లో యష్ చేసిన పాత్ర పేరు రాఖీ భాయ్ అనే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment