
శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీ
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ప్రి ఎంగేజ్‌మెంట్ పార్టీ గురువారం రాత్రి ముంబైలోని ముకేశ్ నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు షారూక్ ఖాన్ దంపతులు, రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్, విదూ వినోద్ చోప్రా, ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ దంపతులు తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో కలసి వచ్చారు.
(అంజలి, సచిన్ తెందూల్కర్ , గౌరి, షారుఖ్‌ఖాన్ , ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ )