కొడుకుతో నీతా అంబానీ సంబరాలు (PC: IPL X)
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో తొలి గెలుపు కోసం ఎంతగానో తపించి పోయింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేయడంతో అటు పాండ్యాతో పాటు.. ఇటు మేనేజ్‌మెంట్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి.
ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మపై వేటు వేసినందుకు తగిన శాస్తే జరిగిందంటూ సొంత అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వారి కోపాన్ని చల్లారుస్తూ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఈ సీజన్‌లో మొదటి గెలుపు అందుకుంది.
సొంత మైదానం వాంఖడేలో భారీ స్కోరు నమోదు చేయడమే కాకుండా ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 29 పరుగుల తేడాతో చిత్తు చేసి పాయింట్ల ఖాతా తెరిచింది. దీంతో ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మనకి రెండు పాయింట్లు వచ్చాయి అన్నట్లుగా కొడుకు ఆకాశ్‌తో కలిసి నీతా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు ఈ విజయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసింది. అటు హార్దిక్ పాండ్యా సైతం అనేక అవమానాల అనంతరం గెలుపు దక్కడంతో తొలిసారిగా మనస్ఫూర్తిగా నవ్వినట్లు కనిపించింది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ హైలైట్‌గా నిలిచారు. చిన్నపిల్లలా తన సంతోషాన్ని పంచుకుంటూ ఆమె చేసిన సందడి అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘వేల కోట్లు ఉంటేనేం.. నీతా మేడమ్‌కు ఇప్పుడు కలిగిన ఆనందం మాత్రం వెలకట్టలేనిది’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఇక తాజా పరాజయంతో నాలుగో ఓటమి నమోదు చేసిన ఢిల్లీ పదోస్థానానికి పడిపోయింది.
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు:
►వేదిక: వాంఖడే, ముంబై
►టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్
►ముంబై స్కోరు: 234/5 (20)
►ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 205/8 (20)
►ఫలితం: 29 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై విజయం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రొమారియో షెఫర్డ్(ముంబై- 10 బంతుల్లో 30 రన్స్- నాటౌట్)
►ఓవరాల్ టాప్ స్కోరర్: ట్రిస్టన్ స్టబ్స్(ఢిల్లీ- 25 బంతుల్లోనే 71 రన్స్- నాటౌట్).
చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు
That feeling of your first win of the season 😀
— IndianPremierLeague (@IPL) April 7, 2024
A blockbuster batting and a collective bowling performance help Mumbai Indians get off the mark in #TATAIPL 2024 on a special day at home 🙌
Scorecard ▶ https://t.co/Ou3aGjpb7P #TATAIPL | #MIvDC pic.twitter.com/5UfqRnNxj4
Comments
Please login to add a commentAdd a comment