
యాంకర్ హెల్త్‌కేర్ సీఈవో, వైస్ చైర్మన్ విరైన్ మెర్చంట్ కూతురు రాధికా మర్చంట్‌తో అనంత్ ప్రేమలో ఉన్నాడంటూ..
భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతా, ఇషా- ఆనంద్ పిరమాల్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక అంబానీ ఫ్యామిలీలో చిన్నవాడైన అనంత్ అంబానీ కూడా వివాహానికి సిద్ధమైనట్టుగానే కన్పిస్తోంది. యాంకర్ హెల్త్‌కేర్ సీఈవో, వైస్ చైర్మన్ విరైన్ మెర్చంట్ కూతురు రాధికా మర్చంట్‌తో అనంత్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అంబానీ ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అయితే లోకో కోమోలో జరిగిన ఇషా ఎంగేజ్‌మెంట్‌లో వీరిద్దరు చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో వీరి రిలేషన్ నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
వీడియోలో ఏముందంటే..
ఇషా ఎంగేజ్‌మెంట్ వేడుకలో.. ఇషా చేయి పట్టుకుని ముఖేశ్ అంబానీ ఆనంద్ దగ్గరికి తీసుకువస్తున్న సమయంలో.. ఆయన వెనుకే నడుస్తున్న ఆకాశ్ అంబానీ కాబోయే భార్య శ్లోకా మెహతా చేయి పట్టుకుని నడుస్తుండగా.. అనంత్ రాధిక చేయి పట్టుకుని నడుస్తున్నాడు. దీంతో అనంత్- రాధికల ప్రేమకు కూడా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా లోకో కోమోలో జరిగిన ఎంగేజ్‌మెంట్ పార్టీలో ఇషా పీచ్ కలర్ డిజైనర్ గౌన్‌లో మెరిసిపోగా.. ఆనంద్ పిరమాల్ గ్రీన్ కలర్ షేర్వానీలో వెలిగిపోయారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకకు సోనమ్ కపూర్ దంపతులు, ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కరణ్ జోహర్, మనీష్ మల్హోత్ర వంటి బాలీవుడ్ ప్రముఖలు హాజరయ్యారు.