
మొన్నామధ్య సోనమ్ కపూర్ పెళ్లితో బాలీవుడ్ దద్దరిల్లింది. తారాగణం అంతా కదిలివచ్చి పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యాపారదిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివాహ వేడుకకు హాజరై సందడిచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ముంబైలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్ చేసిన డ్యాన్స్‌లు వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌లు హైలెట్‌గా నిలిచారు. ఈ కార్యాక్రమానికి ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, టైగర్ ఫ్రాఫ్, కరణ్ జోహార్, విద్యాబాలన్, మాధురి దీక్షిత్, అలియాభట్ ఇలా భారీ తారాగణం విచ్చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలు చిన్ననాటి స్నేహితులు. శ్లోకా మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారంలో పేరుగాంచినవారన్న సంగతి తెలిసిందే. ఈ నూతన జంట ఈ ఏడాది చివరికల్లా పెళ్లిబంధంతో ఒక్కటవ్వనున్నారు.