
ముంబై : అంబానీల ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. మొన్నటివరకూ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకలతో బిజీగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబం మరో పెళ్లి వేడుకకు సిద్ధమవుతోంది. నీతా అంబానీ - ముఖేష్ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి పనులు షూరు అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్‌లో వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో.. ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం జరిగింది. మార్చి 9నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుక పనులు చకచక జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది.
ఇషా అంబానీ పెళ్లి చేసుకుంది.. మరికొద్ది రోజుల్లో ఆకాశ్ అంబానీ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి అనంత్ అంబానీ మీద పడిందట. నువ్వేప్పుడు పప్పన్నం పెడతావని అనంత్‌ను అడుగుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో అనంత్ అంబానీ గర్ల్ ఫ్రెండ్ రాధిక మర్చంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ పెళ్లిలో తీసిన ఈ వీడియోలో ఇషా, అనంత్ అంబానీలు డోలు వాయిస్తుండగా.. అందుకు అనుగుణంగా ముఖేష్ అంబానీ, రాధిక మర్చంట్ డ్యాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘మామాకోడళ్ల అనుబంధం బాగానే ఉంది.. త్వరలో మీరు కూడా పెళ్లి పీటలు ఎక్కండి.. ఓ పనైపోతుంది’ అంటున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment