ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సోమవారం అధికారికంగా గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. పాండ్యా ఆగమనంపై ముఖ్యంగా నీతా అంబానీ తెగ మురిసిపోతున్నారు. అందుకే ప్రత్యేకంగా స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సంబరాల్లో ముంబై ఇండియన్స్
హార్దిక్ తిరిగి ఇంటికి రావడం చాలా సంతోషం. ముంబై ఇండియన్స్ కుటుంబంతో హృదయ పూర్వక పునఃకలయిక! ముంబై ఇండియన్స్‌లో యువ స్కౌటెడ్ టాలెంట్ హార్ధిక్ ఇపుడు టీమ్ ఇండియా స్టార్‌గా చాలా ఎదిగిపోయాడు. ఇక ముంబై ఇండియన్స్ భవిష్యత్తును ఎంత ఎత్తుకు తీసుకెడతాడో అని ఎదురు చూస్తున్నాం అంటూ నీతా అంబానీ ప్రకటించారు. కీలక సమయాల్లో హార్దిక్ మంత్ర కావాలని నీతా కోరుకున్నారు. అందుకే అతణ్ణి తిరిగి పొందారంటున్నారు క్రికెట్ పండితులు.
అటు హార్దిక్ తిరిగి రావడం గురించి ముంబై ఇండియన్స్ సహ యజమాని ఆకాష్ అంబానీ తన ఆనందాన్ని ప్రకటించారు. ఇది హ్యపీ హోం కమింగ్. ఏ జట్టుకైనా అతడు గొప్ప సమతూకంగా ఆడతాడు. అంతకుముందు MI కుటుంబంలో విజయం సాధించాడు. ఇపుడిక రెండోసారి కూడా విజయమే అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్‌కు సంబంధించి ఈ సీజన్ వరకు గుజరాత్ టైటన్స్ (Gujarat Titans, GT)కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఇపుడు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సరసన జట్టుతో చేరాడు. వచ్చే ఏడాదిలో జరిగే మెగా టోర్నమెంట్ ఐపీఎల్ 2024లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
This brings back so many wonderful memories. Mumbai. Wankhede. Paltan. Feels good to be back. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/o4zTC5EPAC
— hardik pandya (@hardikpandya7) November 27, 2023
విక్రమ్ సోలంకి ఏమన్నారంటే..
గుజరాత్ టైటాన్స్ తొలి కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీకి రెండుఅద్భుతమైన సీజన్‌లుఅందించడంలో కీలక పాత్ర పోషించాడంటూ గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి పాండ్యాను ప్రశంసించారు. కానీ ఇప్పుడు అసలు జట్టు ముంబై ఇండియన్స్‌కి తిరిగి వెళ్లాలనే తన నిర్ణయాన్ని గౌరవిస్తామని, భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నా మన్నారు
కాగా అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుని ఛాంపియన్‌గా నిలిచింది గుజరాత్ టైటాన్స్. ఆ ఈ ఏడాది లాస్ట్ బాల్ వరకూ ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచింది జీటీ. అలా వరుసగా రెండు సీజన్స్‌లోనూ గొప్ప ప్రతిభ కనబర్చి గుజరాత్ టైటాన్స్ జట్టును మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ నిలపగలిగాడీ ఆల్ రౌండర్ హార్ధిక్ ప్యాండ్యా అనడంలో ఎలాంటి సందేహంలేదు.
Comments
Please login to add a commentAdd a comment