ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రోజు (మార్చి 9వ తేదీ శనివారం, రాత్రి ) ఆకాశ్, శ్లోకా మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లి సందడి ముంబై జియో టవర్స్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకుకు దేశ విదేశాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులతో పాటు, హితులు, సన్నిహితులు, బంధు మిత్రులతో పెళ్లి వేడుక కళకళలాడుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖేశ్, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్ అంబానీ .. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ వివాహానికి ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీ కుటుంబ సభ్యులు, కోకిలా బెన్ అంబానీ సందడి చేస్తుండగా, పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రముఖులు ఇప్పటికేవివాహ వేదికకు తరలి వచ్చారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమతి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, టోనీబ్లేయర్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment