దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రియలన్స్ ఇండస్ట్రీస్ షేరు గురువారం రికార్డు గరిష్టానికి తాకింది. అబుదాభి ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ముమబదలా జియో ఫ్లాట్‌ఫామ్‌లో రూ.9,093 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం రియలన్స్ షేరు రికార్డు గరిష్టాన్ని అందుకునేందుకు కారణమైంది. జియోలో వరుస పెట్టుబడులు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు నిన్నటి ముగింపు(రూ.1579.95)తో పోలిస్తే 1.38శాతం లాభంతో రూ.1601.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2.38శాతం లాభపడి రూ.1617.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు ఏడాది గరిష్ట స్థాయి కావడం విశేషం. ఉదయం 10గంటలకు షేరు క్రితం మునపటి ముగింపుతో పోలిస్తే 1.50శాతం లాభంతో రూ.1603.80 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.867.45, రూ.1617.70గా ఉన్నాయి
రిలయన్స్ మార్కెట్ క్యాప్ @ రూ.10లక్షల కోట్లకు....
రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో కేవలం 6వారాల్లో జియో ఫ్లాట్‌ఫామ్‌లో మొత్తం రూ.87,655.35 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు కంపెనీ తెలిపంది. ఈ నేపథ్యంలో నేడు రియలన్స్ రికార్డు గరిష్టాన్ని తాకింది. అలాగే కంపెనీ నిర్వహించిన రైట్ ఇష్యూ విజయవంతం కావడంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ మరోసారి రూ.10లక్షల కోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment