రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌ న్యూ సిరీస్‌ 6 లాంఛ్‌ | PRE BOOK APPLES LATEST LAUNCHES AT RELIANCE DIGITAL | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌ న్యూ సిరీస్‌ 6 లాంఛ్‌

Published Fri, Sep 25 2020 8:00 PM | Last Updated on Fri, Sep 25 2020 8:02 PM

PRE BOOK APPLES LATEST LAUNCHES AT RELIANCE DIGITAL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యాపిల్‌ వాచ్‌ న్యూ సిరీస్‌ 6, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ, ఐపాడ్‌ 8 జనరేషన్‌ ప్రీ బుకింగ్‌ను అన్ని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌, మై జియో స్టోర్స్‌లో రిలయన్స్‌ డిజిటల్‌ ప్రారంభించింది. కస్టమర్లు ఈ ఉత్పత్తులను ఇక తమ సమీప రిలయన్స్‌ డిజిటల్‌ లేదా మై జియో స్టోర్స్‌తో పాటు రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌ లోనూ ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈనెల 30 వరకూ పొందవచ్చని రిలయన్స్‌ డిజిటల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : రిలయన్స్ చేతికి బజాజ్ ఎలక్ట్రానిక్స్‌

ఇక యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, వాచ్‌ ఎస్‌ఈ రిటైల్‌ విక్రయాలు అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 బ్లడ్‌ ఆక్సిజన్‌ స్ధాయిలను తెలిపే ఫీచర్‌తో పాటు ఆల్‌ న్యూ స్లీపీయాప్‌, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ సేవల వంటి ఆధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. న్యూ యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 ప్రారంభ ధర రూ 40,900 కాగా, ఇక యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ శ్రేణి రూ . 29,900 నుంచి అందుబాటులో ఉంటుందని రిలయన్స్‌ డిజిటల్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement