న్యూఢిల్లీ: 5జీ పరికరాలను, నెట్‌వర్క్‌ను పరీక్షీంచేందుకు ఉపయోగపడే టెస్ట్‌బెడ్ ప్రాజెక్టు తుది దశలో ఉందని టెలికం విభాగం తెలిపింది. ఇది డిసెంబర్ 31 నాటికి పూర్తి కాగలదని పేర్కొంది. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా తదితర టెల్కోలు హైదరాబాద్, చెన్నైతో పాటు పలు నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహణకు సైట్లను ఏర్పాటు చేసుకున్నాయని వివరించింది.వచ్చే ఏడాది ఈ నగరాల్లోనే తొలుత 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని టెలికం విభాగం పేర్కొంది.
5జీ టెస్ట్‌బెడ్ ప్రాజెక్టుకు టెలికం విభాగం దాదాపు రూ. 224 కోట్ల మేర నిధులు అందిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌తో పాటు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ మొదలైన ఎనిమిది సంస్థలు దీనిపై దాదాపు 36 నెలలుగా పని చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment