సాక్షి, న్యూఢిల్లీ : కొత్త టెలికాం శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలను స్వీకరించి రవి శంకర్ ప్రసాద్ దూకుడు పెంచారు. మరో వంద రోజుల్లో 5 జీ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే హువావే 5 జీ ట్రయల్స్‌లో పాల్గొనే అంశాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని చెప్పారు. భారతదేశంలో 5 జి ట్రయల్స్ ప్రారంభించడానికి 100 రోజుల గడువుని నిర్ణయించారు . ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే 5 జీ ఆధారిత తదుపరి స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని చెప్పారు.
ట్రయల్ మొదలైన తరువాత 5 జిలో పాల్గొనడం అనేది తప్పనిసరికాదు అని, భద్రతా సమస్యలతో సహా ఒక కంపెనీ పాల్గొంటుందా లేదా అనేది సంక్లిష్టమైందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాధాన్యత జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కీలకంగా ఉంటుందన్నారు. ఎందుకంటే, ఈ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉనికి సమంజసమని తాను భావిస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఐటీ, న్యాయశాఖమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment