Ravi sankar prasad
-
మెగా బూస్ట్: చెన్నైలో అమెజాన్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫైర్ టీవీ స్టిక్స్ సహా తమ డివైజ్‌లను చెన్నైలో తయారు చేయనుంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీతో జట్టు కట్టనుంది. మేకిన్ ఇండియాకు మెగా బూస్టింగ్‌గా భారతదేశంలో టెలివిజన్ స్ట్రీమింగ్ పరికరాల తయారీని ప్రారంభిస్తోంది. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా అమెజాన్ త్వరలో భారతదేశంలో ఫైర్‌టివి స్టిక్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రారంభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం వెల్లడించారు. ‘భారత్‌లో ఇది తొలి తయారీ కేంద్రం అవుతుంది. స్వావలంబన దిశగా భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి మేం కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. భారత్‌లోని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డివైజ్ తయారీ ప్రోగ్రాం కింద ఏటా పెద్ద ఎత్తున ఫైర్ టీవీ స్టిక్ డివైజ్‌లు (వీడియో స్ట్రీమింగ్కి ఉపయోగపడేవి) తయారు చేస్తాం‘ అని అమెజాన్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. మేకిన్ ఇండియా పట్ల తమ నిబద్ధతను ఇది సూచిస్తుందని, ఉద్యోగాల కల్పనకు, నూతన ఆవిష్కరణలను పెంచుతుందని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. అయితే, ప్లాంటు తయారీ సామర్థ్యం, ప్రాజెక్టుపై ఎంత ఇన్వెస్ట్ చేయనున్నదీ మాత్రం వెల్లడించలేదు. Held a very good conversation with @AmitAgarwal and @Chetankrishna of @amazonIN today. Delighted to share that soon Amazon will commence manufacturing of electronics products like FireTV stick in India. pic.twitter.com/BRpnUG6fA5 — Ravi Shankar Prasad (@rsprasad) February 16, 2021 -
వంద రోజుల్లో 5జీ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త టెలికాం శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలను స్వీకరించి రవి శంకర్ ప్రసాద్ దూకుడు పెంచారు. మరో వంద రోజుల్లో 5 జీ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే హువావే 5 జీ ట్రయల్స్‌లో పాల్గొనే అంశాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని చెప్పారు. భారతదేశంలో 5 జి ట్రయల్స్ ప్రారంభించడానికి 100 రోజుల గడువుని నిర్ణయించారు . ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే 5 జీ ఆధారిత తదుపరి స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని చెప్పారు. ట్రయల్ మొదలైన తరువాత 5 జిలో పాల్గొనడం అనేది తప్పనిసరికాదు అని, భద్రతా సమస్యలతో సహా ఒక కంపెనీ పాల్గొంటుందా లేదా అనేది సంక్లిష్టమైందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాధాన్యత జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కీలకంగా ఉంటుందన్నారు. ఎందుకంటే, ఈ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉనికి సమంజసమని తాను భావిస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఐటీ, న్యాయశాఖమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. -
డేటాపై ఈసి కీలక నిర్ణయం
సామాజిక మాధ్యమాల్లోని వినియోగదారుల సమాచారాన్ని ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోంది. ఫేస్బుక్ యూజర్ల డేటా లీకేజీ అంశం భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఉల్లంఘనలు జరగకుండా ఏయే చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంగళవారం ( ఈ నెల 27న) ఈసీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై చర్చించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు సమావేశమవుతారు. ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలతో కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించినట్టు, మనదేశంలోనూ బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ), తదితర పార్టీలతో ఆ సంస్థ భారత భాగస్వామి కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీఏ డేటా ఉల్లంఘనల నేపథ్యంలో ఫేస్‌బుక్‌తో ఈసీ కొనసాగిస్తున్న సంబంధాలను సైతం సమీక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీరావత్ పేర్కొన్నట్లు ఓ ఇంగ్లిష్ పత్రిక వెల్లడించింది. యువజన ఓటర్ల నమోదు ప్రోత్సాహానికి ఫేస్బుక్ సంస్థతో ఈసీ కలిసి పనిచేయడంతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ 2017 జూలైలో సామాజికమాధ్యమం వేదికగా భారతీయ వినియోగదారులకు 13 భాషల్లో ఈసీ విజ్ఞప్తులు పంపించింది. గతంలోనూ ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు మూడుపర్యాయాలు ఫేస్‌బుక్‌తో ఈసీ కలిసి పనిచేసింది. ఈ నేపథ్యంలో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రిటన్ బ్రెగ్జిట్ రిఫెరండం, ఇతర దేశాల్లోని ఎన్నికలను ప్రభావితం చేసిన విధంగా ఇక్కడి లోక్‌సభ ఎన్నికల్లో జరగకుండా ఉండేందుకు పరిరక్షణచర్యలు చేపట్టేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఈసీ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా చోటుచేసుకునే ఆయా పరిణామాలను తప్పుడు పద్ధతుల్లో పక్కదోవ పట్టించే ప్రయత్నాలు, శక్తులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు ఈసీ అధికార ఒకరు వెల్లడించారు. ఈ చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమాలు ఉపయోగించి ఓటర్లను అవాంచిత ప్రభావానికి గురిచేయకుండా, వీటి ప్రభావం ఓటింగ్ ప్రతికూలంగా పడకుండా ఉండేలా చూడాల్సి ఉందని చెప్పారు. ఎన్నికలు ప్రభావితమయ్యే ఏ అంశంపై అయినా ఈసీ దృష్టిపెడుతుందన్నారు. వచ్చే వారం జరగనున్న సమావేశంలో మాత్రం ప్రధానంగా డేటా దుర్వినియోగానికి సంబంధించిన సమస్యల తీవ్రతను విశ్లేషించి, వాటిని అరికట్టేందుకు ఏయే చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రచారాన్ని సీఏ సంస్థ నిర్వహించిందన్న బీజేపీ ఆరోపణలపై సైతం ఈసీ సోషల్ మీడియా సెల్ నివేదిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రకటన, ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ త్రోసిపుచ్చినా, గురువారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ వీటినే మళ్లీ సంధించారు. సీఏతో అంటకాగుతున్నది మీరంటే మీరంటూ బీజేపీ,కాంగ్రెస్ పరస్పర ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అతిక్రమించే అంశాల పర్యవేక్షణకు మీడియా విధానాన్ని రూపొందిస్తున్నట్టు గతేడాది ఆగస్టులో సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. ఆన్లైన్లో ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు కొన్ని ప్రజాసంబంధాల సంస్థలు చురుకుగా పనిచేస్తున్నట్టు ఈసీ దృష్టికి వచ్చిందని చెప్పారు. రోజురోజుకు మొబైల్–ఇంటర్నెట్ టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ప్రభావం కేఊడా పెరుగుతోందన్నారు. అందువల్ల సామాజికమాధ్యమాల్లోని ఆయా విషయాలు, అంశాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈసీ ఆ దిశలో అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'ఏపీని నంబర్‌వన్‌గా చేయడమే బీజేపీ ఉద్దేశం'
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా చేయాలనేది బీజేపీ ఉద్దేశమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ రెండేళ్ల పాలన సందర్భంగా ఏపీలో పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 4న కాకినాడ సభకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరుకానున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. -
విశాఖలో ‘సమీర్’కు కేంద్రమంత్రి శంకుస్థాపన
► ఏర్పాటుకానున్న ఎలక్ట్రానిక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్ కేంద్రాలు విశాఖపట్నం: సాగర నగరిలో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం ఏర్పాటు కానుంది. విశాఖలో కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో రూ.80.02 కోట్లతో గంభీరం ఐటీ సెజ్‌లో ఏర్పాటు కానున్న సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) సెంటర్‌కు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఎలక్ట్రానిక్ రీసెర్చ్ సెంటర్, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ‘సమీర్’ విశాఖలో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇంటర్ఫిరెన్స్ అండ్ కంపాటిబిలిటీ విభాగంలో పరిశోధనలు చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలకు అవసర మైన ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్‌కు ఇది వేదిక కానుంది. దీనివల్ల రక్షణ రంగంతో పాటు అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పరిశోధనల స్థాయి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సంబంధిత ఇంటర్ఫిరెన్స్, కంపాటిబిలిటీ, పల్స్ తదితర సౌకర్యాలను ఈ కేంద్రం కల్పిస్తుంది. దీని ద్వారా తూర్పు తీరం లో ఐటీ ఉత్పత్తుల విక్రయ, వినియోగదారులకు ల బ్ధి చేకూరనుంది. ఆర్మీ, నేవల్ సైన్స్ అండ్ టెక్నాల జీ ల్యాబ్, డీఆర్డీవో తదితర సంస్థల అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.45 కోట్లతో ఇంక్యుబేషన్ కేంద్రం కాగా విశాఖలో ఐటీకి ఊతమిచ్చే ఇంక్యుబేషన్ సెంటర్ ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చుతోంది. ఈ కేంద్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని వుడా కేటాయించగా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఆఫ్ ఇండియా నిర్మాణం చేపట్టబోతోంది. సిరిపురం జంక్షన్లో ఉన్న వుడా స్థలంలో ఈ కేంద్రాన్ని రూ.45 కోట్లతో నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనిషన్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ల సమక్షంలో గురువారం దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటుతో సుమారు 25వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. -
సదానంద గౌడ: పబ్లిక్ ప్రాసిక్యూటర్
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిన కర్ణాటకకు చెందిన డీవీ సదానందగౌడ దక్షిణ కన్నడ జిల్లా సూల్యా తాలూకాలో 1953 మార్చి 19న జన్మించారు. లా చదివిన ఆయన కొద్ది కాలం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం పుట్టూరు శాసనసభ స్థానం నుంచి 1994, 1999లలో 2 సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సదానందగౌడ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తొలిసారిగా దక్షిణ భారత దేశంలో బీజేపీ(కర్ణాటకలో) అధికారం చేపట్టింది. రవిశంకర ప్రసాద్.. మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రవిశంకర ప్రసాద్(60) బీహార్‌కు చెందిన సీనియర్ రాజకీయ నేత. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా మంచి పేరు గడించారు. 1954, ఆగస్ట్ 30న బీహార్‌లో ఉన్నతస్థాయి కులంలో జన్మించిన ప్రసాద్.. పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ, ఎల్ఎల్బీ చేశారు. రాం విలాస్ పాశ్వాన్: రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దళిత నేత, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు 67 ఏళ్ల రాం విలాస్ పాశ్వాన్. ఎప్పటికప్పుడు పంథా మారుస్తూ సీజనల్ రాజకీయాలు చేయడంలో దిట్ట. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఎన్డీయే నుంచి వైదొలిగిన పాశ్వాన్ తిరిగి ఇదే గూటికి చేరి ఇప్పుడు కేబినెట్ మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. అనంతకుమార్: 55 ఏళ్ల అనంతకుమార్ బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి సన్నిహితుడు. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన వ్యక్తి, రాజకీయ నైపుణ్యం కలిగిన నాయకుడు. బెంగళూరు సౌత్ నుంచి ఆరోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. కర్ణాటకకు చెందిన అనంతకుమార్ 1959 జూలై 22న ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.మైసూర్ వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. గోపీనాథ్ ముండే: మహారాష్ట్రకు చెందిన ఓబీసీ నేత. ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం ఇదే తొలిసారి. 15వ లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్నారు. బీడ్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ముండేను ఓడించేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలించలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముండే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారు. కల్రాజ్ మిశ్రా: జేపీ సహచరుడు జయప్రకాశ్ నారాయణ్ సహచరుడు, సంఘ్ ప్రచారక్ అరుున కల్రాజ్ మిశ్రా ఉత్తరప్రదేశ్ రాజకీయూల్లో కురువృద్ధుడు. నాటి జన్ సంఘ్‌తో సహవాసం ఆయన రాజకీయ జీవితానికి పునాదులు వేసింది. జేపీ ప్రారంభించిన ‘సంపూర్ణ క్రాంతి’ (టోటల్ రివల్యూషన్) ఉద్యమంలో కన్వీనర్‌గా పని చేశారు. మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యూరు. మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 1941లో యూపీలోని ఘాజీపూర్‌లో జన్మించారు. వి.కె.సింగ్: మాజీ సైనికాధిపతి రాజకీయూలకు కొత్త అరుున వి.కె.సింగ్ ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నారు. మాజీ సైనికాధిపతి అరుున 63 ఏళ్ల సింగ్ తన వయస్సుకు సంబంధించిన వివాదంపై యూపీఏ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటమే చేశారు. చివరకు న్యాయ పోరాటంలోనూ ఓడిపోయూరు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 5.67 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి మోడీ తర్వాతి స్థానంలో నిలిచారు. మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 1951 మే 10న పూనాలోని మిలటరీ ఆస్పత్రిలో జన్మించారు.