న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఇంటర్నెట్ వేగం 1,000 ఎంబీపీఎస్ పైగా నమోదైంది. ముంబైలోని ఫీనిక్స్ మాల్‌లో జరుగుతున్న లైవ్ ట్రయల్స్‌లో నోకియా తయారీ గేర్స్‌ను వాడుతున్నారు. టెలికం శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా 3500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎయిర్‌టెల్ 5జీ పరీక్షలు జరుపుతోంది. కోల్‌కతాలోనూ ట్రయ ల్స్ నిర్వహించనున్నట్టు నోకియా ప్రతినిధి వెల్లడించారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్ లో లైవ్ నెట్‌వర్క్‌లో దేశంలో తొలిసారిగా ఎయిర్‌టెల్ ఈ ఏడాది ప్రారంభంలో 5జీ పరీక్షలను హైదరాబాద్‌లో విజయవంతంగా జరిపింది.
చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ?
Exclusive: #Airtel’s #5G trial network goes live in Mumbai’s Phoenix Mall, Lower Parel. 1Gbps speeds. Nokia is the equipment provider for this trial. pic.twitter.com/4vO3RWUbXh
— Danish (@DanishKh4n) July 12, 2021
Comments
Please login to add a commentAdd a comment