న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌లో అల్ట్రా ఫాస్ట్, తక్కువ లేటెన్సీ గల సాఫ్ట్ వేర్ మేజర్ న్యూరల్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ కేసులను విజయవంతంగా పరీక్షించినట్లు భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రకటించాయి. ఈ టెక్నాలజీ ధ్రువీకరణ కోసం ఎయిర్‌టెల్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ ట్రయల్ స్పెక్ట్రమ్ కేటాయించింది. ఈ టెక్నాలజీ మైనింగ్, కెమికల్ ప్లాంట్, ఆయిల్ & గ్యాస్ ఫీల్డ్ వంటి ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేసే రిమోట్ రోబోటిక్ కార్యకలాపాలను నిర్వహించడానికి సహకరిస్తుంది.
ఎయిర్‌టెల్ 5జీ టెక్నాలజీని రిమోట్ రోబోటిక్స్ ఆపరేషన్లు, విజన్ ఆధారిత నాణ్యత తనిఖీల విషయంలో టీసీఎస్ విజయవంతంగా పరీక్షించింది. టీసీఎస్ న్యూరల్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్, 5జీ టెక్నాలజీ కలిసి పారిశ్రామిక కార్యకలాపాలను ఎలా నిర్వావర్తించగలవో, నాణ్యత ఉత్పాదకత & భద్రతను గణనీయంగా ఎలా పెంచగలదో ఈ టెస్టింగ్ నిరూపించింది. పారిశ్రామిక కార్యకలాపాల కోసం 5జీ టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడతుందో ఈ ప్రయోగం నిరూపించింది. 5జీ కేవలం ఈ పారిశ్రామిక రంగంలో మాత్రమే కాకుండా అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొని రానుంది.
Comments
Please login to add a commentAdd a comment