షావోమీ నుంచి తొలి 5జీ ఫోన్‌ | Xiaomi Mi Mix 3 5G variant with Snapdragon 855 showcased in China | Sakshi
Sakshi News home page

షావోమీ నుంచి తొలి 5జీ ఫోన్‌

Published Sat, Dec 8 2018 2:03 PM | Last Updated on Sat, Dec 8 2018 2:23 PM

Xiaomi Mi Mix 3 5G variant with Snapdragon 855 showcased in China - Sakshi

షావోమీ మి మిక్స్‌3 డెమో

చైనా: స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో తనదైన మార్క్‌తో దూసుకుపోతున్న మొబైల్  దిగ్గజం షావోమి తాజాగా మొబైల్ మార్కెట్‌లోకి మరో అధునాతనమైన మొబైల్‌ని లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో  ఈ  స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత కొద్ది కాలంగా పలు మొబైల్‌ కంపెనీలు 5జీ ఫోన్‌ తయారీపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇతర దిగ్గజ కంపెనీలకంటే ముందే షావోమీ తన మిక్స్‌ ఫ్లాగ్‌షిప్‌లో తొలి 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది.  బీజింగ్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో తొలి 5జీ ఫోన్‌ ఎంఐ మిక్స్‌ 3ని ప్రదర్శించింది. 5జీ నెట్‌వర్క్‌ ద్వారా మరింత స్పీడ్‌ను ఎలా అందుకోవచ్చో డెమో వీడియో ద్వారా చూపించింది. ఈ ఫోన్‌ శక్తివంతమైన క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855తో రానుందని తెలిపింది. 5జీ వేగాన్ని అందుకోవడానికిగాను ఎక్స్‌50 మోడెమ్‌ను అమరుస్తున్నారు. దీనివల్ల 2ఎంబీపీఎస్‌ వేగాన్ని అందుకోవచ్చు.  2019 మొదట్లో ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఎంఐ మిక్స్‌3 ఫీచర్లు
6.39 ఇంచ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్‌ రిజల్యూషన్‌
క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855
10 జీబీ ర్యామ్‌
256జీబీ అంతర్గత మెమోరీ
12+12 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా
24+2 ఎంపీ డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా
3200 ఎంఏహెచ్‌ బ్యాటరీ
వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement