Xiaomi Mobile company
-
కస్టమర్లకు ట్రూ 5జీ సేవలు.. రిలయన్స్ జియోతో జతకట్టిన షావోమి ఇండియా!
దేశంలోని నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమి ఇండియా, రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులకు 'ట్రూ 5 జీ' అనుభవాన్ని అందిస్తోంది. షియోమి, రెడ్ మి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అంతరాయం లేని ట్రూ 5 జీ కనెక్టివిటీని యాక్సెస్ చేసుకోవడానికి, అంతరాయం లేని వీడియోలను స్ట్రీమ్ చేయడానికి, అధిక రిజల్యూషన్ వీడియో కాల్స్ ఆస్వాదించడానికి, వారి పరికరాలలో తక్కువ-లేటెన్సీ గేమింగ్ ఆడటానికి ఈ అనుబంధం వీలు కల్పిస్తుంది. జియో ట్రూ 5 జీస్టాండ్‌లోన్ (ఎస్ఎ) నెట్ వర్క్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వినియోగదారులు తమ షియోమి, రెడ్ మి స్మార్ట్ ఫోన్ స్టెట్టింగ్‌లలో ఇష్పడే నెట్ వర్క్‌ను 5జీకి మార్చాలి. రిలయన్స్ జియో ట్రూ 5 జీ ఎస్ఎ నెట్ వర్క్ లో సజావుగా పనిచేయడానికి ఎస్ఎ నెట్ వర్క్ మ్దదతు ఇచ్చే మోడళ్లు సాఫ్ట్వేర్ అప్డేట్ పొందాయి. 5జీ స్టేవలు పొందే పరికరాలలో ఎంఐ 11 అల్ట్రా 5జీ, షియోమి 12ప్రో 5జీ, షియోమి 11ట్రీ ప్రో 5జీ, రెడ్ మి నోట్ 11 ప్రో+ 5జీ, షియోమి 11 లైట్ ఎన్ 5జీ, రెడ్ మి నోట్ 11టీ 5జీ, రెడ్ మి 11 ప్రైమ్ 5జీ, రెడ్ మి నోట్ 10టీ 5జీ, ఎంఐ 11ఎక్స్ 5జీ, ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ, రెడ్ మి కే50ఐ 5జీ, షియోమి 11ఐ 5జీ, షియోమి 11ఐ హైపర్ ఛార్జ్ 5జీ ఉన్నాయి. రెడ్ మీ కే50ఐ, రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ఫోన్లను రిలయన్స్ జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో పరీక్షించారు. ప్రస్తుతం షియోమి, రెడ్ మీ నుంచి చాలా 5 జీ ఎనేబుల్ అయిన పరికరాలు రిలయన్స్ జియో ట్రూ 5 జీ నెట్ వర్క్ తో బాగా పనిచేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం గురించి షియోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్ మాట్లాడుతూ “గత రెండేళ్లుగా షియోమి #IndiaReady5G చేయడానికి కట్టుబడి ఉంది. మేము 5 జీ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నాం. మా స్మార్ట్ఫోన్లు టాప్- ఆఫ్- లైన్ ఫీచర్లతో ఆకర్షణీయమైన 5 జీ అనుభవాన్ని అందిస్తున్నాయన్నారు. ఈ అనుబంధం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.., “కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి, తన వినియోగదారుల చేతుల్లోకి అత్యాధునిక ఆవిష్కరణలను తీసుకురావడానికి షియోమి ఎప్పుడూ ముందంజలో ఉందన్నారు. వారితో కలిసి తమ వినియోగదారులకు 5జీ సేవలు అందించడంతో సంతోషంగా ఉందన్నారు. జియో ట్రూ 5 జీ మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉండడంతో పాటు భారత్‌లో ఏకెైక ట్రూ 5జీ నెట్ వర్క్‌గా నిలిచింది 1. 4జి నెట్ వర్క్ పై జీరో డిపెండెన్సీతో అధునాతన 5 జీ నెట్ వర్క్ తో 5 జీ ఆర్కిటెక్చర్ 2. 700 MHz, 3500 MHz , 26 GHz బ్యాండ్ల లో 5జీ స్పెక్ట్రం అతిపెద్ద, అత్యుత్తమ మిశ్రమం 3. క్యారియర్ అగ్రిగేషన్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ 5 జీ ఫ్రీక్వెన్సీలను ఒకే బలమైన "డేటా హైవే"గా సజావుగా మిళితం చేసే కాయరియర్ అగ్రిగేషన్. చదవండి: Meesho Shopping Survey: ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు! -
షావోమి నుంచి వస్తున్న స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా!
ఆధునిక కాలంలో యువకుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్రాడెక్ట్ వాడకంపై ఆసక్తి చూపుతుంటారు. అయితే మిగిలిన వాటితో పోలిస్తే ఈ కొత్తదనం 'మొబైల్స్' లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో మొబైల్స్ విడుదల చేస్తుంటాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'షియోమీ' (Xiaomi) మార్కెట్లో కొత్త మొబైల్ '13 సిరీస్' లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే లాంచ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్‌ని 2022 డిసెంబర్ 01 న చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో కంపెనీ 'షియోమీ 13' 'షియోమీ 13 ప్రో' అనే రెండు మోడల్స్ ఉన్నాయి. త్వరలో విడుదలకానున్న కొత్త 'షియోమీ 13 సిరీస్' అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో లైకా బ్రాండెడ్ సెన్సార్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది రన్ అవుతుంది. షావోమి 13 Pro 12GB ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా హ్యాండ్సెట్ 2k రిజల్యూషన్‌తో 6.7 ఇంచెస్ సామ్సంగ్ ఈ6 అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. షావోమీ కొత్త సిరీస్ రెండు రకాల ర్యామ్ లతో రావచ్చని రూమర్ల ద్వారా తెలిసింది. అవి 8 GB, 12GB,అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 128GB, 256GB, 512GB వరకు జత చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే.. కెమెరా సిస్టమ్ 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడిన 50MP సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్, రెండవ 50MP టెలిఫోటో లెన్స్‌ను పొందుతుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంటుంది. చివరగా బ్యాటరీ విషయానికి వస్తే, Xiaomi 13 సిరీస్ 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాగా Xiaomi 13 Pro 120watt ఫాస్ట్ ఛార్జింగ్ పొందవచ్చు. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్
చైనా మొబైల్ మేకర్ షావోమి మరో స్మార్ట్‌ఫొన్ తీసుకురానుంది. తొలిసారి వాటర్ డ్రాప్ నాచ్‌తో ఎంఐ ప్లే పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. అయిదే విడుదలకు ముందే ఈ డివైస్ ఫీచర్లు, ప్రత్యేకతలు నెట్లో లీక్ అయ్యాయి. ఎంఐ ప్లే సిరీస్‌లో మొదటిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. షావోమి దీనికి సంబంధించిన టీజర్‌ను వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. దీని ధర వివరాలను ప్రకటించకపోయినప్పటికీ 3, 4, 6జీబీ వెర్షన్స్‌లో బ్లూ, రెడ్, బ్లాక్, వైట్, రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. ధర సుమారు రూ..19,900 గా ఉండనుందని అంచనా. షావోమి ఎంఐ ప్లే ఫీచర్లు 5.84 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3/4/6 జీబీ ర్యామ్ 32/64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 12 +12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
షావోమీ నుంచి తొలి 5జీ ఫోన్
చైనా: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనదైన మార్క్‌తో దూసుకుపోతున్న మొబైల్ దిగ్గజం షావోమి తాజాగా మొబైల్ మార్కెట్లోకి మరో అధునాతనమైన మొబైల్‌ని లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత కొద్ది కాలంగా పలు మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్ తయారీపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇతర దిగ్గజ కంపెనీలకంటే ముందే షావోమీ తన మిక్స్ ఫ్లాగ్‌షిప్‌లో తొలి 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. బీజింగ్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో తొలి 5జీ ఫోన్ ఎంఐ మిక్స్ 3ని ప్రదర్శించింది. 5జీ నెట్వర్క్ ద్వారా మరింత స్పీడ్‌ను ఎలా అందుకోవచ్చో డెమో వీడియో ద్వారా చూపించింది. ఈ ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855తో రానుందని తెలిపింది. 5జీ వేగాన్ని అందుకోవడానికిగాను ఎక్స్50 మోడెమ్‌ను అమరుస్తున్నారు. దీనివల్ల 2ఎంబీపీఎస్ వేగాన్ని అందుకోవచ్చు. 2019 మొదట్లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎంఐ మిక్స్3 ఫీచర్లు 6.39 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 10 జీబీ ర్యామ్ 256జీబీ అంతర్గత మెమోరీ 12+12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 24+2 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 3200 ఎంఏహెచ్ బ్యాటరీ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం -
రెడ్మి నోట్ 6 ప్రో వన్ డే స్పెషల్ ఆఫర్
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి తాజా స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 6 ప్రో మరోసారి విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న రెడ్మి నోట్ 6ప్రో వన్ డే స్పెషల్ ఆఫర్ పేరుతో వినియోగదారులకు లభిస్తోంది. ఈ రోజు (డిసెంబర్ 5) మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎమ్ఐ డాట్ కామ్‌లలో సేల్ ప్రారంభం. హెచ్డీఎఫ్సీ కార్డుల నుంచి కొనుగోలు చేస్తే మరో రూ. 500 క్యాష్‌బ్యాక్ లభించనుంది. ప్రారంభ ధర 13,999గా ఉండనుంది. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
షియోమీ మొబైల్ కంపెనీకి భద్రత ముప్పు!
బీజీంగ్: అంతర్గత భద్రతకు ముప్పుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ తగిన చర్యలు తీసుకుంటోంది. చైనా దేశస్తులు కాని కస్టమర్లకు సంబంధించిన డేటాను తమ సర్వర్ల నుంచి ఇతర దేశాల్లోని తమ సర్వర్లకు తరలించడానికి నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియా, సింగపూర్ లోని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లకు డేటాను తరలించే పనిలో షియోమీ పడింది. ఈ తరలింపు కార్యక్రమం ఈ సంవత్సరం తొలినాళ్ల నుంచే ప్రారంభినట్టు, అక్టోబర్ చివరకల్లా పూర్తవుతుందని షియోమీ కంపెనీ వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా కొత్త మార్కెట్లలో వ్యాపారాన్ని విస్తరించామని, ఇప్పటికే సింగపూర్, తైవాన్ దేశాల్లో వెబ్ సైట్ స్పీడ్ పెరిగిన విషయాన్ని యూజర్లు గుర్తిస్తున్నారని కంపెనీ తెలిపింది. భారత్ విషయానికి వస్తే 200 శాతం యూజర్లు పెరిగినట్టు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. స్టాటిక్ పేజీల లోడ్ సంబంధించిన అంశంలో వేగం పెంచడానికి సరికొత్త అకమాయ్ గ్లోబల్ సీడీఎన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఊపయోగిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.