షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు లీక్‌ | Xiaomi Mi Play teased before December 24 launch | Sakshi
Sakshi News home page

షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు లీక్‌

Published Wed, Dec 19 2018 3:47 PM | Last Updated on Wed, Dec 19 2018 3:47 PM

Xiaomi Mi Play teased before December 24 launch - Sakshi

చైనా మొబైల్‌ మేకర్‌  షావోమి మరో స్మార్ట్‌ఫొన్‌ తీసుకురానుంది.   తొలిసారి వాటర్‌  డ్రాప్‌  నాచ్‌తో ఎంఐ ప్లే పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది.  అయిదే విడుదలకు ముందే  ఈ డివైస్‌ ఫీచర్లు, ప్రత్యేకతలు నెట్‌లో లీక్‌ అయ్యాయి.  ఎంఐ ప్లే సిరీస్‌లో   మొదటిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.  షావోమి దీనికి సంబంధించిన టీజర్‌ను వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేసింది. దీని ధర వివరాలను ప్రకటించకపోయినప్పటికీ 3, 4, 6జీబీ  వెర్షన్స్‌లో  బ్లూ, రెడ్, బ్లాక్, వైట్, రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది.
ధర సుమారు రూ..19,900 గా ఉండనుందని అంచనా.

షావోమి ఎంఐ ప్లే ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
3/4/6 జీబీ ర్యామ్
32/64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
12 +12 ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement