ఆధునిక ప్రపంచంలో సంపన్నులెవరు? అంటే వెంటనే గుర్తొచ్చేది ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. భారతదేశం విషయానికి వస్తే ముఖేష్ అంబానీ పేరు చెబుతారు. వీరందరికంటే ముందు ఒకప్పుడు ఈ భూమిపైన అత్యంత సంపన్నుడెవరు? అనగానే 'మన్స ముస' (Mansa Musa) పేరే వినిపించేది. ఇంతకీ ఆయనెవరు? ఈయన సంపద విలువ ఎంత ఉండొచ్చు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, 14వ శతాబ్దంలో ఆఫ్రికన్ చక్రవర్తి అయిన మన్స ముస ఈ భూమిపై నివసించిన అత్యంత ధనవంతుడని నమ్ముతారు. చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ సంపన్నుడు 1280 ADలో జన్మించినట్లు, పశ్చిమ ఆఫ్రికాలోని విస్తారమైన మాలి సామ్రాజ్యానికి 1312 ADలో రాజై పరిపాలించినట్లు తెలుస్తోంది. ఈయన సంపద విలువ సుమారు 400 బిలియన్ డాలర్లని అంచనా.. అంటే ఇప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 లక్షల కోట్లు కంటే ఎక్కువ.
మాన్సా మూసా సంపద..
ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ డాలర్లు. ఇప్పటి ప్రపంచ కుబేరులకంటే మన్స ముస సంపద రెట్టింపు అనే చెప్పాలి. అప్పట్లో ఆ దేశపు వనరులు ఉప్పు, బంగారం.
(ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!)
చరిత్రకారుల ప్రకారం.. హజ్ తీర్థయాత్ర కోసం మాలి నుంచి మక్కాకు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ప్రయాణం సాగించిన అతి తక్కువ మందిలో మన్స ముస ఒకరని, అప్పట్లోనే ఈ మార్గంలో వంద ఒంటెలు, భారీ మొత్తంలో బంగారం, 12000 మంది సేవకులు, 8000 మంది అనుచరులను తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.
(ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!)
మన్స ముస ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన రాజు మాత్రమే కాదు, దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఇతన్ని 'కింగ్ ఆఫ్ కింగ్స్' అని పిలిచేవారు. తన ప్రజలకు బంగారాన్ని విరివిగా దానం చేసేవాడని, మాలి సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని ఉత్పత్తి చేసిన ఘనత పొందిందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment