గెల రూ.500 | banana gela rupees 500 | Sakshi

గెల రూ.500

Aug 10 2016 10:00 PM | Updated on Sep 4 2017 8:43 AM

అశ్వారావుపేట మార్కెట్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న అరటి గెలలు

అశ్వారావుపేట మార్కెట్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న అరటి గెలలు

అరటి గెలలకు డిమాండ్‌ పెరిగింది. నిన్నమొన్నటి వరకు గిట్టుబాటు ధర రావడం లేదని నిరుత్సాహంతో ఉన్న అరటి రైతులకు ఊరట లభిస్తోంది. శ్రావణమాసం కావడంతో పూజాపునస్కారాలు, శుభకార్యాల కోసం వినియోగదారులు అరటి పండ్లను బాగా కొనుగోలు చేస్తున్నారు.

    అరటి గెలలకు డిమాండ్‌ పెరిగింది. నిన్నమొన్నటి వరకు గిట్టుబాటు ధర రావడం లేదని నిరుత్సాహంతో ఉన్న అరటి రైతులకు ఊరట లభిస్తోంది. శ్రావణమాసం కావడంతో పూజాపునస్కారాలు, శుభకార్యాల కోసం వినియోగదారులు అరటి పండ్లను బాగా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు అరటి దిగుబడి కూడా తగ్గిపోవడంతో ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మండలకేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో అరటి మార్కెట్లో బుధవారం గెల గరిష్టంగా రూ. 500, కనిష్టంగా రూ.60 ధర పలికింది. ఈ ఏడాది తొలిసారి అధిక రేటు రావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ఈ మార్కెట్‌కు వారానికి 800 గెలల వరకు అమ్మకానికి వస్తాయి. కానీ ఈ వారం కేవలం 400 గెలలు మాత్రమే అమ్మకానికి వచ్చాయని వ్యాపారులు తెలిపారు.     – అశ్వారావుపేట రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement