గెల రూ.500
అరటి గెలలకు డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకు గిట్టుబాటు ధర రావడం లేదని నిరుత్సాహంతో ఉన్న అరటి రైతులకు ఊరట లభిస్తోంది. శ్రావణమాసం కావడంతో పూజాపునస్కారాలు, శుభకార్యాల కోసం వినియోగదారులు అరటి పండ్లను బాగా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు అరటి దిగుబడి కూడా తగ్గిపోవడంతో ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో అరటి మార్కెట్లో బుధవారం గెల గరిష్టంగా రూ. 500, కనిష్టంగా రూ.60 ధర పలికింది. ఈ ఏడాది తొలిసారి అధిక రేటు రావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ఈ మార్కెట్కు వారానికి 800 గెలల వరకు అమ్మకానికి వస్తాయి. కానీ ఈ వారం కేవలం 400 గెలలు మాత్రమే అమ్మకానికి వచ్చాయని వ్యాపారులు తెలిపారు. – అశ్వారావుపేట రూరల్