ప్రతీకాత్మక చిత్రం
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు చోచాంగ్ గ్రామానికి వచ్చిన ఓ ఎన్‌జీఓ బృందానికి చెందిన ఐదుగురు మహిళలపై దుండగులు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. వలసలు, మానవ అక్రమ రవాణాలపై అవగాహన కల్పించేందుకు 11 మంది సభ్యులతో కూడిన ఎన్‌జీఓ బృందం గ్రామానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దుండగులు బృందంలోని పురుషులను చితకబాది ఐదుగురు మహిళలను సమీప అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి తుపాకీ గురిపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.
నిందితులను గుర్తించిన పోలీసులు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని డీఐజీ అమోల్ వీ హోంకర్ తెలిపారు. లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఘటనపై అధికారులకు తెలియపరచలేదని, తమకు అందిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment