చిలమత్తూరు (హిందూపురం) : రెండేళ్ల క్రితం (2015లో) కలకలం రేపిన 35 నకిలీ పాసు పుస్తకాలకు సంబంధించి చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో సీఐడీ ఇన్‌స్పెక్టర్ బీవీ రమణ, ఎస్‌ఐ శ్రీనివాసులు (కర్నూలు) మంగళవారం విచారణ చేపట్టారు. పాసు పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తహసీల్దార్ ఇబ్రహీంసాబ్, డిప్యూటీ తహసీల్దార్ రంగనాయకులు, వీఆర్వోలతో పాసు పుస్తకాలు జారీ, అడంగళ్, సర్వే నంబర్లు తదితర అంశాలపై చర్చించారు. పాసు పుస్తకాలకు సంబంధించిన రైతులను విచారణ చేశారు. నివేదికలను సీఐడీ కోర్టుకు పంపనున్నట్లు ఇ¯న్‌స్పెక్టర్ తెలిపారు.