
న్యూఢిల్లీ: విచారణలో ఉన్న ఖైదీపై ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఖైదీ వినోద్ అలియాస్ బాల్లే మృతి చెందాడు. విచారణ కోసం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా రోహిణి కోర్టు క్యాంటీన్‌కు చేరువలో నిందితుడిపై కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.