
ముంబై: ఒక న్యాయవాది వాదించే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. కారణం.. సదరు న్యాయవాది మాస్క్ ధరించకుండా తన వాదనను వినిపించేందుకు సిద్ధం కావడమే.. నో మాస్క్ నో విచారణ అని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచీ న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు మాస్క్‌ను తొలిగించి వాదనలకు ఉపక్రమించాడు. అది గమనించిన జస్టిస్ చవాన్ వెంటనే స్పందిస్తూ.. ఆ కేసును విచారించేందుకు నిరాకరించి మరో కొత్త తేదిని ప్రకటించారు.
లాక్‌డౌన్ కాలంలో కోర్టులు ఆన్‌లైన్‌లోనే కేసుల్ని విచారించాయి. ఈ మధ్యనే కోర్టులు భౌతికంగా న్యాయవిచారణ చేపట్టాయి. అదే సమయంలో కరోనా నిబంధనల ను అనుసరించి తీరాలనీ తీర్మానించారు. ఈ ఎస్‌ఓపీఎస్ ప్రకారం కోర్టులో న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం అనివార్యం చేశారు. జస్టిస్ పథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ‘కోర్టులో న్యాయ విచారణ చేపట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించిన వారు మాత్రమే కోర్టు హాలులో ఉండాలనీ, మిగతా న్యాయవాదులంతా పక్క రూమ్‌లో తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడాలి, కేసు విచారణ సమయంలో సబార్డినేట్‌లు వాదిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సీనియర్ న్యాయమూర్తులు కూడా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సిందే’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment