చెన్నై: అర్థరాత్రి మహిళకు ఫోన్ చేసి ఎంక్వైరి పేరుతో పిచ్చి వేషాలు వేసిన ఓ పోలీసు అధికారి చేత ఉన్నతాధికారులు పదవీ విరమణ చేయించారు. వివరాలు.. సదరు పోలీసు తిరుచురాపల్లి సమీపంలోని పెరంబలూర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు ఓ కేసు నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి సదరు అధికారి ఎంక్వైరి పేరుతో రాత్రి పూట మహిళకు ఫోన్ చేసి అక్కరకు రాని విషయాల గురించి మాట్లాడుతుండే వాడు.
కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న మహిళ.. చివరకు సదరు అధికారి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే అతడి మీద గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడంతో పొన్మలై స్టేషన్ నుంచి పెరంబలూర్‌కు బదిలీ చేశారు. ఇక్కడ కూడా అలానే ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు 1977 బ్యాచ్‌కు చెందిన సదరు అధికారి చేత పదవీ విరమణ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment