
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలు కేసుల విచారణలో భాగంగా లెక్కలేనంత మంది సాక్షులను ఎందుకు విచారిస్తాయోనంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు 1,500 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం దీనిపై స్పందిస్తూ ‘ప్రతి కేసులోనూ కనీసం వంద నుంచి 200 మంది సాక్షులు ఉంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ రోడ్డు ప్రమాద కేసులోనూ దాదాపు 200 మంది సాక్షులున్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షి లేరు. ఇంతమంది సాక్షులెందుకో మాకు అర్థం కాదు’ అని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment