న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రభుత్వ అధికారులు, జడ్జీలకు విచారణ, వారి అవినీతిపై మీడియా కవరేజీ నుంచి రక్షణ కల్పిస్తూ రాజస్తాన్ సర్కారు ఆర్డినెన్స్ తేవడాన్ని ‘ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) అధ్యక్షులు అఖిల ఉరంకార్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర సర్కారు నిర్ణయం మీడియా గొంతు నొక్కేయడమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలపై దాడేనని విమర్శిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఇలాంటి ఆర్డినెన్స్ తేవడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. అధికారులు, మాజీ జడ్జీలను విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ముందస్తు అనుమతిలేకుండా విచారణ, అవినీతి వ్యవహారాలపై మీడియా కథనాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ సెలక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment