సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మరుగునపడ్డ ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారనే దానిపై విచారణ చేపట్టనుంది. గతంలో డ్రగ్స్ సరఫరా, వినియోగం వరకూ ఎక్సైజ్ శాఖ దృష్టిపెట్టింది. ఈ కేసులో చికాగో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానిస్తోంది. ఎక్సైజ్‌శాఖ్ నుంచి వివరాలు తీసుకుని ఈడీ విచారించనుంది.
చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment