
పవర్ రాగానే జయ మృతిపై విచారణ: స్టాలిన్
డీఎంకే అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిషన్ వేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ చెప్పారు.
రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని, రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, ప్రజాదరణతో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. జయలలిత మరణం వెనుక కుట్రదాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.