శింగనమల : మండల కేంద్రం సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యలపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం కొండపైకి వెళ్లి సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వారిది బత్తలపల్లి, గాయపడిన మహిళది ధర్మవరం కావడంతో ఆ రెండు మండలాల్లోనూ శింగనమల పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతి చెందిన పెద్దన్న ఎప్పటి నుంచి గంగమ్మ పూజారిగా ఉన్నారు, వీరి మేనల్లుడు ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రికి పరిచయాలున్నాయా లేక గుప్తనిధుల కోసం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.