
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో రామోజీరావును 8 గంటలపాటు విచారించారు సీఐడీ అధికారులు. అనంతరం సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధార్ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్గదర్శిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు.
'ఒక కేసుకు సంబంధించి రామోజీరావును విచారించాం. ఆయన స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డు చేశాం. తన కోడలు శైలజా కిరణ్ ఇంటికి వచ్చి విచారించాలని రామోజీరావు కోరారు. అందుకే ఇక్కడే విచారణ జరిపాం. ఈ కేసులో కొత్త సాక్ష‍్యాధారాల ఆధారంగా రామోజీరావును మళ్లీ విచారిస్తాం.
రామోజీ స్టేట్మెంట్‌ను అనలైజ్ చేయాల్సి ఉంది. ట్రాన్స్ఫరెన్స్ దర్యాప్తులో బాగంగా విచారణ జరిపాం. ఐవోతో సహా టెక్నికల్ స్టాఫ్ విచారణలో పాల్గొన్నారు. రామోజీరావు కోడలు శైలజాకిరణ్‌ను ఈనెల 6న విచారిస్తాం. ఆమెకు కూడా 160 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చాం.' అని సీఐడీ ఎస్పీ తెలిపారు.
చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్‌ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం?
Comments
Please login to add a commentAdd a comment