సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు సీఐడీ ఫిర్యాదు చేసింది. విచారణలో సీఐడీ గుర్తించిన అక్రమాలపై కీలక వివరాలు వెల్లడించింది.
మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. కాగా, విచారణలో మార్గదర్శి అక్రమాలు బయటపడ్డాయి. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ. సబ్‌స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సీఐడీ గుర్తించింది. వడ్డీలిస్తామని డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధుల మళ్లింపులను బయట్టపెట్టింది. దీంతో, మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ లేఖ రాసింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఏపీ సీఐడీ సమాచారం పంపించింది. దీంతో, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది.
సీఐడీ గుర్తించినవి ఇవే..
- మార్గదర్శిలో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలను గుర్తించారు.
- ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు
- బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు.
- చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు
- ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌కు విరుద్దంగా నగదు లావాదేవీలు.
Comments
Please login to add a commentAdd a comment