సాక్షి, హైదరాబాద్: ఐసీస్ అనుబంధ సంస్థ అబుదాబి మాడ్యుల్ అనుమానితుల విచారణ రెండో రోజైన బుధవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ ఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అను మానితుల్ని ప్రశ్నిస్తోంది. అబ్దుల్లా బాసిత్, ఖదీర్ సహా మొత్తం 8 మందిని వరుసగా రెండో రోజూ విచారించారు. ఒక్కొక్కరిని దాదాపు 6 గంటల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. వీరి వాంగ్మూలాల్లో 4 కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీం తో వారిని ఎన్‌ఐఏ కార్యాలయానికి పిలిపించిన పోలీసులు కొన్ని అంశాల గురించి ప్రశ్నించారు. రాత్రి 7కి అందరినీ ఇళ్లకు పంపిన అధికారులు మళ్లీ గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ విచారణ ప్రక్రియ మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment