బంగారు వ్యాపారి సుదర్శన్‌రెడ్డి ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. అతను విశాఖపట్టణంలో ఉండగా ప్రొద్దుటూరు పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్‌రెడ్డి ఈ నెల 7న నాలుగు కిలోల బంగారుతో ఉడాయించిన విషయం తెలిసిందే
ప్రొద్దుటూరు క్రై ం:
బంగారు వ్యాపారి సుదర్శన్‌రెడ్డి ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. అతను విశాఖపట్టణంలో ఉండగా ప్రొద్దుటూరు పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్‌రెడ్డి ఈ నెల 7న నాలుగు కిలోల బంగారుతో ఉడాయించిన విషయం తెలిసిందే. డీఎస్పీ పూజితానీలం అతని కోసం ప్రత్యేక బందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సుదర్శన్‌రెడ్డి రాసిన ఆరు పేజీల లేఖలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా అతను మిత్రులకు, సన్నిహితులకు లేఖలను పోస్టు చేశాడు.
ఉత్తరాలే దారి చూపాయా..!
అతను పోస్టు చేసిన వాట్సప్ నెంబర్ ఆధారంగా సుదర్శన్‌రెడ్డిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగానే అతను విశాఖపట్టణంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను తీసుకొని వెళ్లిన బంగారులో కొంత మేర ఖర్చుపెట్టినట్లు సమాచారం. సుదర్శన్‌రెడ్డిని పోలీసులు డీఎస్పీ పూజితానీలం ఎదుట హాజరు పరిచారు. అతను పెద్ద మొత్తంలో బంగారుతో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమైనా బంగారుతో అతను తిరిగి రావడంతో బాధితుల్లో సంతోషం వ్యక్త మవుతోంది.